కలం, వెబ్ డెస్క్ : సాంప్రదాయ ఇంధత వినియోగాన్ని తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా భారత్ గ్రీన్ ఎన్నిర్జీని తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే గ్రీన్ ఎనర్జీవైపు కీలక ముందడుగు పడింది. దేశవ్యాప్తంగా రాయితీ ధరలో ‘E85’ పెట్రోల్ (E85 Petrol) ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు సిద్ధమవుతుండటంతో, భారతదేశం స్వచ్ఛమైన ఇంధనం ప్రవేశపెట్టడంలో మరో ముందడుగు వేసింది. బయో-ఇంధనంలో ఉండే తక్కువ శక్తి సామర్థ్యాన్ని భర్తీ చేసేందుకు, E20 పెట్రోల్ ధరతో పోలిస్తే లీటరుకు రూ.20 తక్కువ ధరకు E85 ఇంధనాన్ని విక్రయించనున్నట్లు పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. ఢిల్లీలోని ఓ పెట్రోల్ పంపు వద్ద E85 ఇంధన పంపీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
E85 అనేది 85 శాతం ఇథనాల్ తో పాటు 15 శాతం పెట్రోతో కలిసిన ఇంధనం. అలాగే, పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌లో శక్తి సామర్థ్యం సుమారు మూడవ వంతు తక్కువగా ఉంటుంది. ఈ తేడాను భర్తీ చేసేందుకే వినియోగదారులకు రాయితీని కల్పిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న E20 మిశ్రమం (20% ఇథనాల్ మరియు 80% పెట్రోల్) కూడా అన్ని ఇంధన కేంద్రాల్లో లభిస్తుంది. దీనికి కారణం భారతీయ రోడ్లపై తిరిగే చాలా వాహనాలు 20 శాతం వరకు ఇథనాల్ మిశ్రమంతో నడిచే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
ఇథనాల్ మిశ్రమ ఇంధన లభ్యతను దశలవారీగా విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఢిల్లీ, పుణె, ముంబై, నాగ్‌పూర్ నగరాల్లో సుమారు 50 నుండి 100 ఇథనాల్ పంపిణీ కేంద్రాల్లో E85 పెట్రోల్ (E85 Petrol) లభించనుంది. 2026 చివరి నాటికి ఈ కేంద్రాల సంఖ్య 500కు.. 2027 చివరి నాటికి దేశవ్యాప్తంగా 5,000 కేంద్రాలకు పెరుగే అవకాశాలు ఉన్నాయి.
Read Also: లూధియానాలో రైలు ప్రమాదం: రెండు ముక్కలైన స్పెషల్ ట్రైన్ బోగీ!
Follow Us On: Sharechat

