కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : మహబూబ్‌నగర్ (Mahabubnagar) మండలం కోట కదిర, పోతనపల్లి, మాచనపల్లి గ్రామాలలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ (Madhusudan Naik) శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామాలలోని నర్సరీలను, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనుల పురోగతిని ఆయన స్వయంగా ద్విచక్ర వాహనంపై వెళ్లి పరిశీలించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పనుల నాణ్యత, పురోగతి, అమలు తీరుపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా చూడాలని అదనపు కలెక్టర్ సూచించారు.

