ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్(World Para Athletics Championships)లో భారత క్రీడాకారులు అద్భుతంగా రాణించింది. ఛాంపియన్ షిప్‌ను ముగించడంలో కూడా తమ మార్క్ చూపించుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ అత్యధికంగా 22 పతకాలను సొంతం చేసుకుంది. వీటిలో 6 పసిడి పతకాలు, 9 రజతాలు, 7 కాంస్య పతకాలు ఉన్నాయి. పోటీలకు చివరి రోజైన ఆదివారం మరో నాలుగు పతకాలను 3 రజతాలు, ఒక కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.
World Para Athletics Championships | మహిళల 200 మీటర్ల T12 ఫైనల్స్‌లో సిమ్రన్(Simran Sharma).. 24.46 సెకన్ల టైమింగ్‌తో రజతం గెలుసుకున్నారు. ఇప్పటికే 100మీటర్ల టీ12 కేటగిరీలో ఆమె స్వర్ణం సాధించారు. మహిళల 100 మీటర్ల టీ35 ఫైనల్స్‌లో ప్రీతి.. 14.33 సెకన్ల టైమింగ్‌తో కాంస్యం సాధించారు. పురుషుల జావెలిన్ త్రో F41 కేటగిరీలో 45.46 మీటర్లతో నవ్‌దీప్ రెండో స్థానంలో నిలిచి రజతం గెలుచుకున్నారు. పురుషుల 200 మీటర్ల T44 విభాగంలో సందీప్ 23.60 సెకన్లతో కాంస్యం గెలిచాడు. ఇదిలా ఉంటే ఈ ఛాంపియన్‌షిప్‌లో 44(15 స్వర్ణ, 20 రజత, 9 కాంస్య) పతకాలతో బ్రెజిల్ టాప్‌లో నిలిచింది. చైనా 52 (13-22-17), ఇరాన్ 16 (9-2-5) మెడల్స్‌తో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

