కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో యద్ధ (Weat Asia War) సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ ఒకపక్క.. ఇరాన్ మరోపక్క ఉద్రిక్తతలు పెంచుతున్నాయి. ఈ అనిశ్చితి కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు, ఇంధనం ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. అందులో భాగంగానే సప్లై చెయిన్ దెబ్బ తిని భారత్ ఎరువుల ఉత్పత్తి (Fertilizer Production) తగ్గే అవకాశాలున్నాయనే ఆందోళన నెలకొంది. భారత్ లో ఉన్న ఎరువుల డిమాండ్ కోసం యూరియా, ఫాస్పెటిక్ ఎరువుల దిగుమతిపై ఆధారపడి ఉంది. ఈ క్రమంలోనే పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వేల ఎరువుల నిల్వల (Fertilizer Reserves) పై రైతుల్లో ఉన్న అపోహల వేళ నిల్వలపై క్లారిటీ ఇచ్చింది కేంద్రమంత్రి జేపీ నడ్డా పార్లమెంట్ వేదికగా క్లారిటీ ఇచ్చారు.
దేశంలో రబీ 2025–26 కాలానికి సంబంధించి సరిపడా ఎరువుల స్టాక్ (Fertilizer Reserves) ఉందని వెల్లడించింది. మార్చి నాటికి దేశ వ్యాప్తంగా 53.08 లక్షల మెట్రిక్ టన్నులు (LMT) యూరియా, 21.80 LMT డీఏపీ, 7.98 LMT ఎంఓపీ, 48.38 LMT ఎన్పీకేఎస్ నిల్వలు ఉన్నట్లు కేంద్రం వివరించింది. ఈ సీజన్ అవసరాలకు మించి ఈ స్టాక్ ఉందని.. సకాలంలో రైతులకు అందుబాటులో ఉంటుందని భరోసా కల్పించింది. న్యూ యూరియా పాలసి –2015, న్యూ ఇన్వెస్ట్ మెంట్ పాలసీ – 2012 కింద దేశీయ యూరియా ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. 2014-15లో 225 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నుంచి 2023-24లో రికార్డు స్థాయి 314.07 లక్షల మెట్రిక్ టన్నులు, 2024-25లో 306.67 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుందని కేంద్రం వివరించింది. దీని వల్ల దిగుమతులపై భారం తగ్గినట్లయింది.
భారత్ ప్రధానంగా డీఏపీ, ఎన్పీకేల దిగుమతులపై ఆధారపడి ఉంది. ఈ క్రమంలో సౌదీ అరేబియాతో (Saudi Arabia
) ఏటా 31 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ, ఎన్పీకే సరఫరాపై దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకోవడంతో సరఫరాపై స్థిరత్వానికి అవకాశం ఉంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్ లో హెచ్చు తగ్గులు ఉన్నా.. రైతులకు భారం పడకుండా సబ్సీడి ద్వారా ఎరువులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ఎరువుల ఉత్పత్తి, సరఫరా, నిల్వలపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని కేంద్ర మంత్రి నడ్డా స్పష్టం చేశారు.
Read Also: పురుషాధిక్య రాజకీయాల్లో.. నారీ భేరీ
Follow Us On: X(Twitter)

