epaper
Monday, February 23, 2026
epaper

స్పిన్‌పై ఆటకు పదును పెట్టాలి: టీమిండియా కోచ్

కలం, స్పోర్ట్స్: స్పిన్ బౌలింగ్ ఆడటంపై టీమిండియా స్పెషల్ ఫోకస్ పెట్టాలని టీమిండియా కోచ్ రయయన్ టెన్ డుస్పాటే (Ryan ten Doeschate) అభిప్రాయం వ్యక్తం చేశారు. స్పిన్‌ను ఎలా ఆడాలి అన్న వ్యూహాలకు భారత్ పదును పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అజేయంగా దూసుకెళ్తున్న టీమిండియాకు స్పిన్ సవాల్‌పై హెచ్చరిక వచ్చింది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో నెదర్లాండ్స్‌పై 17 పరుగుల తేడాతో గెలిచిన తర్వాత ఈ అంశం ముందుకు వచ్చింది. అహ్మదాబాద్‌లో మ్యాచ్ అనంతరం సహాయ కోచ్ రయన్ టెన్ డూస్చాటే స్పిన్ అనుకూల వికెట్లపై స్పష్టమైన గేమ్ ప్లాన్ అవసరమని తెలిపారు. గ్రిప్ ఇచ్చే పిచ్‌లు, పెద్ద బౌండరీలు మధ్య ఓవర్లలో ఇబ్బంది పెడుతున్నాయని చెప్పారు.

టాప్ ఆర్డర్‌లో ఆరుగురు ఎడమచేతి బ్యాటర్లు ఉండటంతో ప్రత్యర్థులు ఫింగర్ స్పిన్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారని వెల్లడించారు. గ్రూప్ దశలో భారత్ అత్యధికంగా ఆఫ్ స్పిన్‌ను ఎదుర్కొందని గణాంకాలు సూచిస్తున్నాయి. నెదర్లాండ్స్ మ్యాచ్‌లో ఆర్యన్ దత్ పవర్‌ప్లేలోనే అభిషేక్ శర్మను (Abhishek Sharma) ఔట్ చేశాడు. ఇది అభిషేక్‌కు వరుసగా మూడో డక్. దత్ 2 వికెట్లు తీసి ప్రభావం చూపాడు. ఆరంభ దెబ్బల తర్వాత సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. మధ్య ఓవర్లలో మరింత స్పష్టమైన వ్యూహం అవసరమని కోచ్ (Ryan ten Doeschate) అంగీకరించారు. అయినా ప్రస్తుత కాంబినేషన్‌పైనే నమ్మకం ఉందని తెలిపారు. అభిషేక్‌పై పూర్తి విశ్వాసం ఉన్నట్లు స్పష్టం చేశారు.

Read Also: క్రికెట్‌కు న్యూజిలాండ్ బ్యాటర్ గుడ్‌బై

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>