మంత్రుల అవినీతి ఆడియోలు బయటపెడుతాం : బండి సంజయ్

కలం, డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రుల అవినీతి చిట్టాను త్వరలోనే బయటపెడుతామన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay). మంత్రుల అవినీతికి సంబంధించిన ఆడియో రికార్డులు తమ వద్ద ఉన్నాయని.. వాటన్నింటినీ బయటపెడుతామని చెప్పారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి మాత్రమే కనిపిస్తోందని విమర్శించారు. ఢిల్లీకి డబ్బు మూటలు మోయడానికే ఈ ప్రభుత్వం పనిచేస్తోందని బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు.

మున్సిపాలిటీల్లో చైర్మన్ల ఎన్నికల్లో బీజేపీని అడ్డుకోడానికే కాంగ్రెస్, బీఆర్ ఎస్ చేతులు కలిపాయని కేంద్రమంత్రి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోళ్లతో మున్సిపాలిటీలను దక్కించుకుందని.. ఇలాంటి బరితెగింపు పాలనను ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని.. కాంగ్రెస్ కు మరో అవకాశం లేదని విమర్శలు గుప్పించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>