బాక్సింగ్ వరల్డ్ కప్‌కు భారత్.. మీనాక్షి, దీపక్‌కు కొత్త బాధ్యత

కలం, వెబ్ డెస్క్: బాక్సింగ్ వరల్డ్ కప్ 2026 (స్టేజ్-2) (Boxing World Cup 2026) కోసం భారత జట్టును ప్రకటించారు. జూన్ 15 నుంచి 21 వరకు చైనాలోని గుయాంగ్‌లో జరిగే ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో ప్రపంచ నంబర్-1 బాక్సర్ మీనాక్షి, సీనియర్ బాక్సర్ దీపక్ భారత జట్టుకు నాయకత్వం వహించనున్నారు. గత వరల్డ్ కప్ సిరీస్‌లో భారత బాక్సర్లు పలు పతకాలు సాధించగా, ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత బాక్సింగ్ సమాఖ్య అనుభవజ్ఞులు, యువ ప్రతిభలతో కూడిన బలమైన జట్టును ఎంపిక చేసింది.

ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-10 బాక్సర్ల సంఖ్య పరంగా భారత్ మూడో స్థానంలో ఉంది. మహిళల విభాగంలో రెండో స్థానం, పురుషుల విభాగంలో నాలుగో స్థానం దక్కించుకుంది. ముఖ్యంగా మహిళల టాప్-3 ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానంలో ఉండటం విశేషం. మహిళల జట్టులో మీనాక్షితో పాటు పూనమ్, ప్రాచి, మహి లామా, సనేహ్, గిటిమోని జి, సనమాచా సి, నైనా, అల్ఫియా తరన్నుమ్ అక్రమ్ ఖాన్ పఠాన్ చోటు దక్కించుకున్నారు. పురుషుల విభాగంలో దీపక్‌తో పాటు రిషి ఎస్, నిఖిల్, అన్మోల్, అభినాష్ జమ్వాల్, మల్సావ్మ్‌టులుయాంగా, జుగ్నూ, హర్ష్ చౌదరి, సావన్ జి ఎంపికయ్యారు.

టోర్నీకి (Boxing World Cup 2026) ముందు జాతీయ శిబిరంలో భారత బాక్సర్లు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పోటీ ద్వారా విలువైన ర్యాంకింగ్ పాయింట్లు సాధించడంతో పాటు అంతర్జాతీయ వేదికపై మరోసారి తమ సత్తా చాటాలని భారత జట్టు ఆశిస్తోంది.

Read Also: రూ.82 కే లీటర్ పెట్రోల్​.. మార్కెట్​ లోకి కొత్త ఇంధనం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>