epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

భారత్​, దక్షిణాఫ్రికా నాలుగో టీ20 రద్దు

కలం, వెబ్​డెస్క్​: పొగమంచు కారణంగా భారత్​, దక్షిణాఫ్రికా మధ్య నాలుగో టీ20 (Ind vs SA 4th T20) రద్దయ్యింది. బుధవారం లక్నో వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్​ దట్టమైన పొగమంచు కారణంగా టాస్​ కూడా వేయకుండానే రద్దుచేశారు. పొగమంచు కారణంగా ఆటగాళ్లు డ్రస్సింగ్​ రూమ్​లకే పరిమితమయ్యారు. ఆటను కొనసాగించేందుకు పలుసార్లు అంపైర్లు పరిశీలించినా సాధ్యపడలేదు. చివరకు రాత్రి 9.30కు మరోసారి పరిశీలించాక ఆటను రద్దు చేస్తున్నట్లు మ్యాచ్​ రిఫరీ, అంపైర్లు ప్రకటించారు. కాగా, ఐదు మ్యాచ్​ల ఈ సిరీస్​లో ప్రస్తుతం భారత్​ 2–1 ఆధిక్యంలో ఉంది. చివరి టీ20 అహ్మదాబాద్​ వేదికగా ఈ నెల 19న జరగనుంది.

Read Also: సచిన్​ను కలసిన భారత మహిళల అంధుల క్రికెట్​ జట్టు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>