కలం, వెబ్ డెస్క్ : ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ (Raja Saab) మూవీపై ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వచ్చింది. ఈ మూవీ ప్రీమియర్ల గురించి కీలక అప్డేట్ ఇచ్చేశారు. మారుతి(Maruthi) డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా జనవరి 9న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. మూవీ ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేశారు. తాజాగా ది రాజాసాబ్(Raja Saab) నుంచి సహానా మెలోడీ సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే ప్రీమియర్స్ పై ఉన్న అనుమానాలపై క్లారిటీ ఇచ్చింది మూవీ టీమ్. జనవరి 8న స్పెషల్ ప్రీమియర్స్ వేయబోతున్నట్టు ప్రకటించారు మూవీ మేకర్స్. అయితే ప్రీమియర్స్ కు స్పెషల్ రేట్లు ఉంటాయా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలోనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నట్టు హింట్ ఇచ్చారు మూవీ టీమ్.
Read Also: ‘పోలీస్ కంప్లైంట్’ టీజర్ లాంచ్
Follow Us On: Instagram


