కరకగూడెంలో అక్రమ మద్యం అమ్మకాలు జోరు

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem)  జిల్లా కరకగూడెం (Karakagudem) మండలంలో అక్రమ మద్యం అమ్మకాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వలస కూలీలు తీవ్రంగా నష్టపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీ ధర కంటే ఒక్కో బాటిల్‌పై రూ.50 నుంచి రూ.70 వరకు ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజంతా కూలికి వెళ్లి సుమారు 300 రూపాయలు సంపాదించే కార్మికులు, అలసటతో బెల్ట్ షాపులకు వెళ్లినప్పుడు అధిక ధరలతో మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వారి జేబులకు భారమై, కుటుంబాల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోంది.

గ్రామ పంచాయతీలలో మద్యపాన నిషేధం అమలులో ఉన్నప్పటికీ, అనుమతి లేని బెల్ట్ షాపులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ప్రజలలో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. మద్యం మత్తుతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇకపై కూడా చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతామని ఆదివాసీ, మహిళా సంఘాలు హెచ్చరించాయి. ఆదివాసీ జేఏసీ నాయకులు గొగ్గలి కృష్ణ, సోలం రామారావు మాట్లాడుతూ, బెల్ట్ షాపులను పూర్తిగా అరికట్టే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అక్రమ మద్యం విక్రయాలపై వెంటనే ప్రభుత్వం స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం చూపుతున్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Read Also: టీవీకే ఘ‌న విజ‌యం.. విజ‌య్‌కి తెలుగు రాష్ట్రాల ప్ర‌ముఖుల విషెస్‌!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>