సీఎం రేవంత్ ప్ర‌చారం చేసిన ప్ర‌తి చోట కాంగ్రెస్ విజ‌యం: ఆది శ్రీనివాస్

కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ ప్ర‌చారం చేసిన ప్ర‌తి చోట కాంగ్రెస్ విజ‌యం సాధించిందని కాంగ్రెస్ నేత, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) అన్నారు. కేరళ‌లో (Kerala Elections) కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్ అద్భుత‌మైన విజ‌యం సాధించిందని కొనియాడారు.కేర‌ళ రాష్ట్రంలో ప‌దేళ్ల త‌ర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ త‌రుపున కేర‌ళ‌లో మూడు రోజుల పాటు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌చారం చేశారని.. అధికార సీపీఎం పార్టీపై రేవంత్ రెడ్డి ప‌దునైన విమ‌ర్శ‌లు చేశారని అన్నారు. కేర‌ళ‌లో విజ‌య‌న్ స‌మ‌యం అయిపోయింద‌ని, ఎక్స్ పైయిరీ ట్యాబ్ లెట్ తో రేవంత్ రెడ్డి పోల్చారని చెప్పారు. బహిరంగ సభల్లో ప‌దునైన మాటలు, సూటి విమ‌ర్శ‌ల‌తో రేవంత్ రెడ్డి ప్ర‌సంగాలు కేర‌ళ ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకున్నాయని తెలిపారు.

కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ త‌ర్వాత కాంగ్రెస్ లో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ నేత‌గా రేవంత్ రెడ్డి ఎదిగారని కొనియాడారు. కేర‌ళ‌లో రేవంత్ రెడ్డికి మంచి క్రేజ్ ఉందని.. ఆయ‌న ప్ర‌సంగాల‌ను మంచి స్పంద‌న వ‌చ్చిందని తెలిపారు. తెలంగాణ‌లో కూడా తిరిగి రెండో సారి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంద‌న్న ధీమా కేర‌ళ విజ‌యంతో పెరిగిందని ఆశాభావం వ్యక్తం చేశారు. దక్ష‌ణ భార‌తదేశంలో తెలంగాణ‌, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ అధికారంలో ఉందని తెలిపారు. రాహుల్ గాంధీ ప్ర‌ధాని అయ్యేలా ద‌క్ష‌ణాది రాష్ట్రాలు పనిచేస్తున్నాయని ఆయన (Aadi Srinivas) వ్యాఖ్యానించారు.

Read Also: ఐపీఎల్ టీం హోటల్ రూల్స్‌పై బీసీసీఐ కొత్త కోడ్ ఆఫ్ కండక్ట్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>