కలం వెబ్ డెస్క్: ప్రపంచ క్వాంటమ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌లో నూతన అధ్యాయం ఆవిష్కృతమైంది. భారత్‌లో తొలి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీని సీఎం చంద్రబాబు (CM Chandrababu) ప్రారంభించారు. అమరావతి (Amaravathi) ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోని 1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటమ్ ఫెసిలిటీ సహా, మేధా టవర్స్‌లోని 1 క్యూ క్వాంటమ్ ఫెసిలిటీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ రెండు క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ ద్వారా క్వాంటం కంప్యూటింగ్ ఉపకరణాలను పరీక్షించే సదుపాయం కల్పించారు. అంతే కాకుండా ఈ రెండు కంప్యూటర్ల ఆవిష్కరణతో దేశంలోనే క్వాంటమ్ టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలవనుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేషనల్ క్వాంటమ్ మిషన్, డీఎస్టీ సహా వేర్వేరు క్వాంటమ్ కంపెనీల ప్రతినిధులు, ఐఐటీ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు.
Read Also: ఏపీ పోలీసులకు గుడ్ న్యూస్.. ఇకపై రెండు స్పెషల్ సెలవులు
Follow Us On: X(Twitter)

