Mobile Popup Ad
Mobile Popup Ad

వరంగల్‌లో గ్యాస్ సంక్షోభం.. బ్లాక్ మార్కెట్‌కు పెరుగుతున్న డిమాండ్

కలం, వరంగల్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో గ్యాస్ సిలిండర్ల అక్రమ దందా (Illegal Gas) పెరుగుతోంది. గ్యాస్ సరఫరాలో లోపాలు, అధికారుల నిర్లక్ష్యం కలిసి ఈ సమస్యను మరింత తీవ్రతరం అవుతుంది. సాధారణంగా మార్కెట్‌లో వాణిజ్య సిలిండర్ ధర రూ.2,166 కాగా, గృహ వినియోగ సిలిండర్ ధర రూ.984గా ఉంది. అయితే కొందరు గ్యాస్ డీలర్లు, డెలివరీ బాయ్స్ కుమ్మక్కై వీటిని అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వాణిజ్య సిలిండర్‌ను రూ.3,000 వరకు, గృహ సిలిండర్‌ను రూ.2,000 వరకు అమ్ముతూ దోపిడీకి పాల్పడుతున్నారు. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నారు.

బుకింగ్ చేసినా ఆలస్యమే…

సాధారణంగా గ్యాస్ బుకింగ్ (Gas Booking) చేసిన  వారం రోజుల్లో సిలిండర్ డెలివరీ కావాలి. కానీ ప్రస్తుతం బుకింగ్ చేసిన 15 రోజులు గడిచినా సిలిండర్ అందని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అత్యవసర సమయంలో కూడా గ్యాస్ అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని డెలివరీ బాయ్స్ తమకు అనుకూలంగా మార్చుకొని, డొమెస్టిక్ సిలిండర్లను బ్లాక్‌లో అధిక ధరలకు (Illegal Gas) విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

హనుమకొండ రెవెన్యూ కాలనీ, జులైవాడ ప్రాంతాలకు చెందిన పలువురు వినియోగదారులు ఈ నెల 17న హెచ్‌పీ యాప్ ద్వారా గ్యాస్ బుక్ చేసుకున్నా ఇప్పటికీ సిలిండర్ అందలేదని తెలిపారు. దీంతో కొందరు హంటర్ రోడ్డులోని గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి ఆందోళనకు దిగారు. అయినప్పటికీ సంబంధిత నిర్వాహకుల నుంచి ఎలాంటి స్పందన లేదని వారు వాపోతున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని తెలిపారు.

మూతపడుతున్న హోటళ్లు

గ్యాస్ కొరత కారణంగా వరంగల్ (Warangal), హనుమకొండ, కాజీపేట్ పట్టణాల్లో పలు హోటళ్లు మూతపడుతున్నాయి. గ్యాస్ సకాలంలో అందకపోవడం, బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు కొనలేకపోవడం వల్ల హోటల్ నిర్వాహకులు వ్యాపారాలను నిలిపివేస్తున్నారు. కొన్ని బిర్యానీ సెంటర్లు, చిన్న రెస్టారెంట్లు కూడా మూసివేయబడ్డాయి. కొందరు నిర్వాహకులు తప్పనిసరి పరిస్థితుల్లో ధరలు పెంచి వ్యాపారం కొనసాగిస్తున్నారు. మరికొందరు మిర్చి, బజ్జీ వ్యాపారులు కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు.

Read Also: ఇరాన్ పై యుద్ధం ఆపొద్దు.. ట్రంప్ కు గల్ఫ్ దేశాల రిక్వెస్ట్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>