తెలంగాణలో దారుణం.. భార్య, కొడుకును హత్య చేసిన తండ్రి

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం పులిగోనిపల్లి (Puligonipalli) తండాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్య, ఇద్దరు పిల్లలపై కత్తి, రోకలి బండతో భర్త రాందాస్ ఘోరంగా దాడి చేశాడు. ఈ ఘటనలో భార్య కవిత (28), కుమారుడు హర్ష (7) అక్కడికక్కడే మృతి చెందారు. కుమార్తె ప్రణిత (10) పరిస్థితి విషమంగా ఉంది. గొడవ కారణంగానే రాందాస్.. తన కుటుంబంపై దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ గొడవకు కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చర్చించుకుంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితుడు రాందాస్ నాయకన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ పాశవిక ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: ఇరాన్ పై యుద్ధం ఆపొద్దు.. ట్రంప్ కు గల్ఫ్ దేశాల రిక్వెస్ట్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>