కలం, వెబ్ డెస్క్: ఆహార కల్తీకి హైదరాబాద్ (Hyderabad) కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఇటీవల ఐస్‌క్రీమ్, అల్లం, బిస్కట్లు, క్యాండీ తదితర ఫుడ్ ఐటెమ్స్ కల్తీ జరిగిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో భారీ కల్తీ వ్యవహారం నగర ప్రజలను షాక్‌కు గురి చేసింది. ఏకంగా చచ్చిన మేకలు, గొర్రెల (Dead Goat Sheep) మాంసంతో పెద్ద ఎత్తున దందా నిర్వహించడం కలకలం రేపుతోంది. మంగళ్‌హాట్ కేంద్రంగా ఈ దందా నిర్వహిస్తున్నారన్న సమాచారంతో గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు, జీహెచ్ఎంసీ బృందాలు సంయుక్తంగా దాడులు చేపట్టాయి. రెండు భారీ గోదాముల్లో నిల్వ ఉంచిన సుమారు 10,000 టన్నుల కుళ్లిపోయిన మేక, గొర్రె మాంసం చూసి అధికారులు షాకయ్యారు. కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ దందా వెనుక అఫ్రోజ్ అనే వ్యక్తి ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. జమ్మూ కశ్మీర్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి చనిపోయిన మేకలు, గొర్రెలను తక్కువ ధరకు తీసుకొచ్చి ఇక్కడ నెలల తరబడి స్టోర్ చేస్తున్నట్లు గుర్తించారు. అనంతరం రసాయనాలతో మాంసాన్ని తాజాగా మార్చి, నగరంలోని హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. అధికారులు మాంసాన్ని సీజ్ చేసి, నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
Read Also: ఛలో చంద్రమండలం..! అపోలో టూ ఆర్టెమిస్
Follow Us On: Instagram

