కలం, వెబ్ డెస్క్ : అపోలో టూ ఆర్టెమిస్.. లాంఛింగ్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. భారత కాలమానం ప్రకారం ‘నాసా’ (అమెరికన్ నేషనల్ ఎయిరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) (NASA) ప్రయోగిస్తున్న ఆర్టెమిస్ (Artemis-2) ఫోరిడా కేప్ కెనర్వాల్ లోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నారు. ఇవాళ (బుధవారం) అర్ధరాత్రి 3:35 గంటలకు ఈ ప్రయోగం ప్రారంభం కానుంది. 2020, అక్టోబర్ 13 వ తేదీన జరిగిన ఒప్పందంలో ఆస్ట్రేలియా, కెనెడా, ఇటలీ, జపాన్, లక్సెంబర్గ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), యునైటెడ్ కింగ్డమ్ (UK), యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA) ఆర్టెమిస్-2లో భాగస్వాములుగా ఉన్నాయి. ప్రత్యక్షంగా భాగస్వామ్యం లేకున్నా భారత్ కూడా ఈ ప్రాజెక్టు ఒప్పందంపై సంతకం చేసింది. కాగా, ఆర్టెమిస్-2 ప్రయోగాన్ని ఇస్రో (ISRO)ఆసక్తికరంగా పరిశీలిస్తోంది.
నలుగురు వ్యోమగాముల బృందం (కమాండర్ రీడ్ వైస్‌మన్, పైలట్ విక్టర్ గ్లోవర్, మిషన్ స్పెషలిస్ట్ క్రిస్టీనా కాచ్, కెనడియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన మరో మిషన్ స్పెషలిస్ట్ జెరెమీ హాన్సెన్) తో కూడిన ఆర్టెమిస్-2 (Artemis 2).. మానవాళి ఎన్నడూ చూడని చంద్రుని దక్షిణ మండలం అవతలి భాగం వరకు సుమారు 9 వేల కిలో మీటర్లు ప్రయాణం చేస్తుంది. చంద్రునిపై పరిశోధన లో ఇది సరికొత్త అధ్యాయనంగా నిలవనుంది. చంద్రుని నుంచి కుజుని వరకు (Moon To Mars) వ్యూహంలో భాగంగా అరుణగ్రహం (Red Planet Mars)పై స్థిరమైన పరిశోధనలు లక్ష్యంగా చేసుకొని మొదట చంద్రునిపై పరిశోధనలు సాగించేందుకు 2017లో అమెరికా ఆర్టెమిస్ ప్రోగ్రాంను చేపట్టింది.
ఐదు దశలు..
మిషన్ ఆర్టెమిస్‌ను నాసా మొత్తం ఐదు దశలుగా చేపట్టనుంది. ఆర్టెమిస్-4 ద్వారా 2028లోపు చంద్రుని దక్షిణ ధృవం మీద మనిషి కాలు మోపడం లక్ష్యం. ఆ తరవాత 2028లో ఆర్టెమిస్-5 ను ప్రయోగం ఉంటుంది. నాసా ఇప్పటికే ఆర్టెమిస్-1 పేరిట 2022లో చంద్రునిపైకి మానవ రహిత ఒరియన్ వ్యోమనౌక (Orion Space Craft)ను పంపించింది. శాస్త్రీయ ఆవిష్కరణలు, ఆర్థిక ప్రయోజనాలు, కొత్త తరం అన్వేషకులకు స్ఫూర్తిని కల్పించడం, ఖగోళ విజ్ఞానంలో ప్రపంచీకరణ (Globalization), మానవాళి ప్రయోజనం కోసం అంతరిక్షాన్ని మరింత లోతుగా అన్వేషించడం ఆర్టెమిస్ మిషన్ ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి.
అపోలో 11 మిషన్ ద్వారా 1969 జులై 20 వ తేదీన చంద్రుని మీద కాలు పెట్టిన మొదటి వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అని చరిత్ర పేజీలు చెప్తున్నా, అదొక హాలీవుడ్ డ్రామా అన్నది విమర్శ. ఆయనతో పాటు మరో ఆస్ట్రొనాట్ బజ్ ఆల్డ్రిన్ సైతం ఆనాడు మూన్ వాక్ చేశాడని అమెరికా వినిపించిన వాదన ఫేక్ అన్నది మరో ఆరోపణ. ఈ వివాదాస్పద నేపథ్యంలో 50 ఏళ్ల తరవాత ఆర్టెమిస్-2 ద్వారా చంద్రునిపైకి అమెరికా తిరిగి వెళ్తోందని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది అమెరికా.
Read Also: ఏఐతో ఈ ఉద్యోగాలకు భయం లేదు !
Follow Us On: Youtube

