గుజరాత్ తో గెలిచినా.. శ్రేయస్ అయ్యర్ కు బిగ్ షాక్

కలం, వెబ్ డెస్క్ : గత ఏడాది తృటిలో కప్ ను చేజార్చుకుని రన్నరప్ గా నిలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు ఐపీఎల్ 2026 (IPL 2026) టోర్నీని అద్భుతంగా ప్రారంభించింది. మంగళవారం న్యూ చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌లో జరిగిన ఈ ఎడిషన్ తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)
తనదైన కెప్టెన్సీతో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ బ్యాటర్లను తక్కువ స్కోరుతో పరిమితం చేశాడు. అంతేకాదు బ్యాటింగ్ లోనూ కూపర్ కానలీని బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు పంపి సక్సెస్ అయ్యాడు. అయితే తాజాగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు ఐపిఎల్ యాజమాన్యం షాకిచ్చింది. స్లో ఓవర్-రేట్ కారణంగా శ్రేయస్ అయ్యర్‌కు జరిమానా విధించింది.

తమ 20 ఓవర్లను పూర్తి చేయడానికి పంజాబ్ కింగ్స్ జట్టు దాదాపు 20 గంటల సమయం తీసుకుంది. అంతేకాదు ఇన్నింగ్స్ చివరి ఓవర్‌కు ముందే టైమర్ ముగియడంతో పంజాబ్ కింగ్స్ కు పెనాల్టీ విధించారు. ఐపిఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కు ఐపీఎల్ యాజమాన్యం రూ. 12 లక్షల భారీ జరిమానా విధించింది. తద్వారా ఈ సీజన్ లో జరిమానాకు గురైన తొలి కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ చివరి ఓవర్‌లో నాలుగు వైడ్‌లు, ఒక నో-బాల్ తో మొత్తం 11 బంతులు వేశాడు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన ఓవర్‌గా కూడా నిలిచింది. అర్ష్‌దీప్ కంటే ముందు ఐదుగురు బౌలర్లు, ఐపీఎల్‌లో ఒకే ఓవర్‌లో 11 బంతులు వేశారు. గుజరాత్ విధించిన టార్గెట్ ను పంజాబ్ కింగ్స్ చివరి ఓవర్‌లో ఛేదించి మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అరంగేట్రం మ్యాచ్ లోనే కేవలం 44 బంతుల్లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 72 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన కూపర్ కానలీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Read Also: ఛలో చంద్రమండలం..! అపోలో టూ ఆర్టెమిస్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>