కలం, వెబ్ డెస్క్ : స్పానిష్ సూపర్ కప్ (Spanish Super Cup) ఫైనల్లో బార్సిలోనా (Barcelona) ఘన విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న బార్సిలోనా.. రియల్ మాడ్రిడ్‌తో (Real Madrid) జరిగిన తుదిపోరులో 3-2 తేడాతో గెలిచి టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఈ విజయంలో రెండు గోల్స్ చేసి రాఫిన్హా (Raphinha) కీలక పాత్ర పోషించాడు. లెవాండోవ్‌స్కీ(Lewandowski) ఒక గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో బార్సిలోనా రికార్డు స్థాయిలో 16వ సూపర్ కప్‌ను సొంతం చేసుకుంది.
మ్యాచ్ ఫస్ట్ హాఫ్ టైమ్ ఉత్కంఠ భరితంగా సాగింది. రాఫిన్హా చేసిన గోల్‌తో బార్సిలోనా ముందంజలో నిలిచింది. వెంటనే వినీషియస్ జూనియర్ అద్భుతమైన ప్రదర్శనతో స్కోరును సమం చేశాడు. స్టాపేజ్ టైమ్‌లో లెవాండోవ్‌స్కీ చేసిన చిప్ గోల్ బార్సిలోనాకు మళ్లీ ఆధిక్యాన్ని ఇచ్చింది. అయితే హాఫ్ టైమ్ ముగిసేలోపు గోన్సాలో గార్సియా గోల్ చేయడంతో స్కోరు మళ్ళీ సమం అయింది. సెకండ్ హాఫ్ టైమ్‌లో ఆట వేగం కొంత తగ్గింది. 73వ నిమిషంలో రాఫిన్హా దూరం నుంచి కొట్టిన షాట్ డిఫ్లెక్ట్ కావడంతో గోల్‌గా మారింది. ఇదే మ్యాచ్‌ను నిర్ణయించిన గోల్‌గా నిలిచింది.
చివరి దశలో ఎంబాప్పే సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చినా గోల్ చేసే అవకాశం దక్కలేదు. ఈ సమయంలో ఫ్రెంకీ డి యాంగ్ ప్రమాదకర టాకిల్‌కు రెడ్ కార్డు పొందాడు. సంఖ్యలో తక్కువగా ఉన్నప్పటికీ బార్సిలోనా రక్షణను పటిష్టంగా కొనసాగించి విజయాన్ని కాపాడుకుంది. ఈ విజయంతో హాన్సీ ఫ్లిక్ కోచ్‌గా నాలుగో ట్రోఫీ సాధించాడు. జూన్‌లో బాధ్యతలు చేపట్టిన జాబీ అలోన్సోకు తొలి ట్రోఫీ కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. బార్సిలోనా ప్రస్తుతం అన్ని పోటీల్లో వరుసగా విజయాలు సాధిస్తూ లీగ్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Read Also: న్యూజిలాండ్‌తో రెండో వన్డేకు వారిద్దరూ దూరం..!
Follow Us On: Youtube


