కలం, వెబ్ డెస్క్: ఐ బొమ్మ రవి (IBomma Ravi) బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో రవిపై నమోదైన ఐదు కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. అయితే, కేసు ఇంకా దర్యాప్తు దశలో ఉందని, నిందితుడికి విదేశీ పౌరసత్వం ఉన్న విషయాన్ని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఈ కేసుల్లో రవికి బెయిల్ ఇస్తే దర్యాప్తుకు ఆటంకం కలిగే అవకాశం ఉందని పోలీసులు వాదించారు. కీలక అంశాలపై విచారణ కొనసాగుతోందని, సాంకేతిక ఆధారాలు సేకరించాల్సి ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా, విదేశీ పౌరసత్వం ఉన్న నేపథ్యంలో ఆయన దేశం విడిచి వెళ్లే ప్రమాదం కూడా ఉందని పోలీసులు అభిప్రాయపడ్డారు.
ఇరు పక్షాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు, ప్రస్తుత దశలో బెయిల్ మంజూరు చేయడం సరికాదని భావించి, రవి (IBomma Ravi) దాఖలు చేసిన ఐదు బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. దీంతో ఆయన జ్యుడిషియల్ కస్టడీలోనే కొనసాగనున్నారు. సైబర్ నేరాలపై దర్యాప్తు తీవ్రంగా కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Read Also: ఐఐటీ హైదరాబాద్ ఆవిష్కరణ.. ఇక ట్రాఫిక్ జామ్‌కు బైబై..!
Follow Us On: Instagram


