తెలుగు పైరసీ కింగ్ ఐబొమ్మ పనైపోయింది. దాని కింగ్‌పిన్ చేతనే ఆ పైరట్ వెబ్‌సైట్‌ను మూయించారు తెలంగాణ పోలీసులు. తెలుగు సినిమాలను విడుదలైన గంటల వ్యవధిలోనే మాస్టర్ ప్రింట్‌లను విడుదల చేస్తో.. టాలీవుడ్‌కు పీడకలలా మారింది ఐబొమ్మ(IBOMMA). గతంలో పోలీసులు దీనిపై ఫుల్ ఫోకస్ పెట్టి మూయించారు. దాంతో అది Bappam TV గా మళ్ళీ వచ్చింది. అయితే ఈసారి పోలీసులు మరింత సీరియస్‌గా తీసుకున్నారు. కొంతకాల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక లేఖలో, “నాది కోట్ల మంది వినియోగదారుల డేటా. iBommaను లక్ష్యం చేయడం ఆపండి” అంటూ రవి( Immadi Ravi) పోలీసులకు సవాలు విసిరినట్లు చెబుతూ ప్రచారంలోకి వచ్చింది. ఆ సవాల్‌ను గంభీరంగా తీసుకున్న సైబర్ క్రైమ్ అధికారులు తమ దర్యాప్తులో వేగం పెంచారు.
శనివారం IBOMMA, Bappam TV నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. అతది ద్వారానే వెబ్‌సైట్లను పూర్తిగా షట్‌డౌన్ చేయించారు. రవి వద్ద లభించిన లాగిన్ వివరాలు, సర్వర్ యాక్సెస్ ఆధారంగా ఈ సైట్లను అధికారికంగా మూసివేశారు. ఇప్పటికే రవి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న వందలాది హార్డ్ డిస్క్‌లను అధికారులు పరిశీలిస్తున్నారు. అతడి బ్యాంక్ లావాదేవీలు, రిక్కార్డులు, పైరసీ ద్వారా వచ్చిన డబ్బు ప్రవాహాలపై లోతైన విచారణ కొనసాగుతోంది. వివరాలను మరింత స్పష్టంగా తెలుసుకోవడానికి రవిని కస్టడీలోకి తీసుకోవాలన్న నిర్ణయంతో, పోలీసులు సోమవారం నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కేసుతో రాష్ట్రంలో ఉన్న పెద్ద పైరసీ రాకెట్లు బయటపడే అవకాశం ఉందని విచారణాధికారులు భావిస్తున్నారు.
Read Also: SSMB29 కాంబో 15ఏళ్ల క్రితమే ఫిక్స్ అయిందా..!
Follow Us on : Pinterest

