epaper
Monday, November 17, 2025
epaper

SSMB29 కాంబో 15ఏళ్ల క్రితమే ఫిక్స్ అయిందా..!

తెలుగు సినీ అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది SSMB29. ఇందులో అతిశయోక్తేమీ లేదు. భారీ బడ్జెట్, నెవ్వర్ బిఫోర్ ట్విస్ట్‌లు, సూపర్ స్టార్, సూపర్ డైరెక్టర్ కాంబో… ఇలా చాలా కారణాలే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను స్పెషల్ చేయడానికి. అయితే జక్కన్న, మహేష్ కాంబో ఫిక్స్ అయింది.. ఇప్పుడు కాదు.. 15 ఏళ్ల క్రితం అని మీకు తెలుసా. ఈ కాంబోను నిర్మాత నారాయణ అప్పుడే ఓకే చేశారు. చేసింది తక్కువ సినిమాలే అయినా.. నారాయణ నిర్మాణ సంస్థలకు ఫ్యాన్ క్రేజ్ ఎక్కువ. అయితే ‘రాఖీ’ తర్వాత వేరే రెండు ప్రాజెక్టులు ఖరారైనా అనివార్య కారణాల వల్ల ఆగిపోయాయి. ఆ సమయంలోనే రాజమౌళి- మహేశ్‌తో సినిమాని ఖరారు చేసుకున్నారు నారాయణ. కానీ, దర్శకుడు అప్పటికే వేరే సినిమాలు అంగీకరించి ఉండటం, ‘బాహుబలి’లాంటి వాటికి అధిక సమయం వెచ్చించాల్సి రావడం, కొవిడ్‌.. ఇలా పలు కారణాల వల్ల క్రేజీ కాంబో మూవీ ఆలస్యమవుతూ వచ్చింది.

అప్పటికి సినిమా ఫిక్స్‌ అయ్యారు తప్ప కథ సిద్ధం చేయలేదు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదలయ్యాక రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్‌ స్టోరీపై కసరత్తు చేశారు. ‘‘రాజమౌళి(Rajamouli)- మహేశ్‌ బాబు(Mahesh Babu) కాంబినేషన్‌ సినిమాను 15 ఏళ్ల క్రితమే ఫిక్స్‌ చేశాం. ఇప్పుడు వాళ్లిద్దరి క్రేజ్‌ మరో స్థాయిలో ఉంది. అయినా ఇచ్చిన మాటకు కట్టుబడి నాకు సినిమా చేస్తున్నారు. నేను చెప్పకపోయినా ‘శ్రీ దుర్గా ఆర్ట్స్‌ బ్యానర్‌’లో మూవీ తీయనున్నట్లు వాళ్లే రివీల్‌ చేశారు. వారికి ధన్యవాదాలు. రాజమౌళికి హాలీవుడ్‌ నుంచి ఆఫర్లు వచ్చినా.. వాటిని కాదనుకుని నా కోసం సినిమా చేస్తున్నారు’’ అని ఓ ఇంటర్వ్యూలో నారాయణ చెప్పారు.

జక్కన్న అప్పుడే చెప్పారు..

తాను మహేశ్‌తో ఓ సినిమా చేయనున్నానని, దానికి నిర్మాత నారాయణ అని దాదాపు పదేళ్ల క్రితమే రాజమౌళి చెప్పారు. సినిమా ప్రారంభించిన సంగతి, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మాత్రం ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటించలేదు. కానీ, ఆ మూవీకి జరగాల్సిన విస్తృత ప్రచారం జరిగింది, జరుగుతూనే ఉంది. కథా నేపథ్యంపై ఎన్నో రూమర్స్‌ వచ్చాయి. టైటిల్‌ ఇదేనంటూ ‘గరుడ’, ‘రుద్ర’, ‘వారణాసి’, ‘సంచారి’.. ఇలా పలు పేర్లు నెట్టింట చక్కర్లు కొట్టాయి. #Globetrotter హ్యాష్‌ట్యాగ్‌తోనే జక్కన్న టీమ్‌ SSMB29ని కొన్ని నెలలుగా ప్రమోట్‌ చేస్తోంది. దానర్థం ప్రపంచాన్ని చుట్టేసేవాడని. మరి, ఇది ఎలాంటి జానర్‌ కథ? టైటిల్‌ ఏంటి? టీజర్‌ ఇస్తారా? ఏకంగా ట్రైలర్‌తో సర్‌ప్రైజ్‌ చేస్తారా?.. ఇలాంటి సందేహాలన్నింటికీ మరికొన్ని గంటల్లో ఫుల్‌స్టాప్‌ పడనుంది. రామోజీ ఫిల్మ్‌ సిటీలో శనివారం సాయంత్రం జరగనున్న గ్రాండ్ ఈవెంట్‌లో వివరాలు వెల్లడికానున్నాయి.

Read Also: ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్ట్

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>