వంగవీటి రంగా ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తాజాగా వంగవీటి రంగా(Vangaveeti Ranga) ఫ్యామిలీలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. తాను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు రంగా కుమార్తె ఆశాకిరణ్(Asha Kiran) ప్రకటించడమే ఈ చర్చలకు కారణం. గతంలో ఇదే అంశంపై తర్వాత స్పందిస్తానన్న ఆశాకిరణ్.. రాధా, రంగా మిత్రమండలి సలహా మేరకు రాజకీయ అరంగేట్రం చేయాలని నిర్ణయించుకున్నారు. తాను మిత్రమండలి సూచించిన పార్టీలో చేరతానని వెల్లడించారు. వైసీపీ నుంచి తనకు వచ్చిన ఆహ్వానంపై ఇప్పుడే స్పందించలేనని అన్నారు. ఈ సందర్భంగానే సోదరుడు రాధ(Vangaveeti Radha)తో విభేదాలపై స్పందించిన ఆమె.. తమ మధ్య ఎటువంటి గొడవలు, విభేదాలు లేవని స్పష్టం చేశారు. తమిద్దరి గమ్యం ఒకటేనని, అది రంగా ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమేనని చెప్పారు.
ఎవరికి ఏ కష్టం వచ్చినా తాను అండగా నిలుస్తానని అన్నారామే. రంగా అంటే కేవలం కాపు కులానికి చెందిన వారు కాదని, అన్ని కులాల వారని అన్నారు. తాను కూడా అదే బాటలో నడుస్తానని చెప్పారు. అయితే మాజీ ఎమ్మెల్యే రాధ దుబాయ్ పర్యటనలో ఉన్న సమయంలో ఆశాకిరణ్(Asha Kiran) తన రాజకీయ ఎంట్రీని ప్రకటించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీని వల్లే విజయవాడ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
Read Also: ఫ్యాన్సీ నెంబర్ ప్రియులకు షాక్
Follow Us on: Youtube

