కలం, వెబ్ డెస్క్ : సన్నీలియోన్ ప్రోగ్రామ్ మీద సాధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2026 న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా చాలా చోట్ల స్పెషల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. ఇందులో భాగంగా యూపీలోని మథురలో జనవరి 1న నిర్వహిస్తున్న ఓ ప్రోగ్రామ్ లో సన్నీలియోన్ (Sunny Leone) పాల్గొనబోతోంది. ఆమెనే ప్రధానంగా ఇందులో పర్ఫార్మెన్స్ ఇవ్వబోతోంది. ఈ ఈవెంట్ మీద స్థానికంగా ఉన్న ఆధ్యాత్మిక సంస్థల్లోని సాధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అశ్లీలతను ఎంకరేజ్ చేసే సన్నీలియోన్ (Sunny Leone) ప్రోగ్రామ్ ను బ్యాన్ చేయాలంటూ వందల మంది సాధువులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
శ్రీకృష్ణుడి జన్మస్థలం అయిన మథురలో నిత్యం ధ్యానాలు, భజనలు, ప్రవచనాలు నిర్వహిస్తామని.. అంత పవిత్రమైన చోట ఇలాంటి ప్రోగ్రామ్ నిర్వహించడం మంచిది కాదంటూ సాధవులు స్థానిక మీడియాతో చెబుతున్నారు. ఈ మేరకు స్థానిక కలెక్టర్ కు వినతిపత్రం కూడా అందజేశారు. ఒకవేళ ఈవెంట్ నిర్వహిస్తే సన్నీలియోన్ మీద ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. మరోవైపు ప్రోగ్రామ్ నిర్వాహకులు మాత్రం పెద్ద ఎత్తున టికెట్లు అమ్ముతున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


