కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH vs PBKS) జట్టు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ దాడితో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో ఓపెనర్ అభిషేక్ శర్మ రెచ్చిపోయాడు. పంజాబ్ బౌలర్లను ఓ రేంజ్ లో ఆడుకున్నాడు. సిక్సర్లు వర్షం కురిపిస్తూ స్టేడియంను హోరెత్తించాడు. సిక్సర్ల మోత మోగిస్తూ అభిమానుల కేరింత రెట్టింపు చేశాడు. ఈ క్రమంలోనే అభిషేక్ శర్మ ఫాస్టెస్ట్ ఫీఫ్టీ అందుకున్నాడు. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే 28 బంతుల్లో 78 పరుగులు చేసిన అభిషేక్ శర్మను శశాంక్ సింగ్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత వెంటనే ట్రావిస్ హెడ్ (38) ను కూడా శశాంక్ ఔట్ చేశాడు.
దీంతో ఓ దశలో పవర్ ప్లే ( 6 ఓవర్లు) కే 100 పరుగుల చేసిన సన్ రైజర్స్ జట్టు స్కోరు ఓపెనర్ల నిష్క్రమణ తర్వాత నెమ్మదించింది. అనంతరం బ్యాటింగ్ వచ్చిన ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ ఇషాన్ కిషన్ (27) ను అర్ష్ దీప్ సింగ్ పెవిలియన్ చేర్చగా.. అనికేత్ వర్మ (18) రనౌట్ అయ్యాడు. సలీల్ ఆరోరా (9) ను స్వల్ప స్కోరుకే అర్ష్ దీప్ సింగ్ ఔట్ చేశాడు. చివర్లో క్లాసెన్ (39) ను బార్ట్‌లెట్ ఔట్ చేశాడు. నితీశ్ కుమార్ రెడ్డి (0), హర్ష్ దుబే (1) ఆజేయంగా క్రీజులో నిలిచారు. దీంతో పంజాబ్ కింగ్స్ ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH vs PBKS) జట్టు 220 పరుగుల టార్గెట్ ను ఉంచింది. అయితే ప్రస్తుతం జరగుతున్న ఐపీఎల్ మ్యాచ్ ల్లో 200 పైగా టార్గెట్ ను జట్లు ఇజీగా ఛేజ్ చేస్తున్నాయి. మరి అదే కొవలో పంజాబ్ కింగ్స్ జట్టు టార్గెట్ ను చేధిస్తుందా? సన్ రైజర్స్ బౌలర్ల సత్తాతో ఏమైనా మ్యాజిక్ జరుగుతుందా? అనేది చూడాలి.
Read Also: గ్యాస్ లేకుండా వంట చేసుకోవచ్చు.. సరికొత్త స్టవ్
Follow Us On: X(Twitter)

