epaper
Tuesday, November 18, 2025
epaper

మియాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు.. ఐదంతస్తుల భవనం నేలమట్టం

హైడ్రా(Hydraa) బుల్డోజర్లు మరోసారి రంగంలోకి దిగాయి. మియాపూర్‌(Miyapur)లోని సర్వేనంబర్ 100లో ఉన్న ఐదంతస్తుల భవనాన్ని శనివారం హైడ్రా అధికారులు, హెచ్ఎండీఏ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో నేలమట్టం చేశారు. ఇక్కడ సర్వే నంబర్లు మార్చి అక్రమనిర్మాణాలు చేపట్టారంటూ స్థానికులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు. నగర పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.

నంబర్లు తారుమారు చేసి అక్రమనిర్మాణాలు

కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు సర్వే నంబర్లు మార్చి అసలైన రికార్డులను తారుమారు చేసి, అక్రమంగా నిర్మాణం చేపట్టారని స్థానికులు ఆరోపిస్తూ హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై విచారణ జరిపిన అధికారులు నిర్మాణం పూర్తిగా అనుమతులు లేకుండా సాగుతోందని నిర్ధారించారు.

దీంతో ఆ ప్రాంతాన్ని పోలీసులు, హైడ్రా(Hydraa) అధికారులు భారీగా మోహరించారు.చుట్టుపక్కల ట్రాఫిక్‌ను మళ్లించారు. ప్రాంతంలో కొంత ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. హెచ్‌ఎండీఏ అధికారులు మాట్లాడుతూ అనుమతి లేకుండా నిర్మాణం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు ఎవరూ చేపట్టొద్దు అని హైడ్రా అ ధికారులు హెచ్చరించారు.

ఇటీవల పలు కూల్చివేతలు

నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు కొనసాగుతోంది. ప్రభుత్వ భూములను ఆక్రమించి భారీగా నిర్మాణాలు చేపట్టిన వారిపై అధికారులు వరుసగా సర్జరీలు చేస్తున్నారు. గత కొన్ని వారాలుగా హైడ్రా బృందాలు మియాపూర్‌, కుత్బుల్లాపూర్, ఓల్డ్ సిటీ వంటి ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టారు.

ఇటీవల గోషామహల్ పరిధిలోని కుల్సుంబాపురాలో హైడ్రా అధికారులు రూ.110 కోట్ల విలువైన భూమిని కాపాడారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన 1.30 ఎకరాల స్థలాన్ని హైడ్రా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి విలువ సుమారు రూ.110 కోట్లు ఉంటుందని అంచనా. హెచ్‌ఎండీఏ, జీహెచ్ఎంసీ, రెవెన్యూ శాఖల సిబ్బంది సంయుక్తంగా ఆపరేషన్‌లో పాల్గొన్నారు. కుత్‌బుల్లాపూర్‌లో రూ.4,500 కోట్ల విలువైన భూమిని హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఇటీవల మేడ్చల్‌, మల్కాజ్‌గిరి జిల్లా కుత్‌బుల్లాపూర్‌ మండలం పరిధిలో 100 ఎకరాలకుపైగా ఆక్రమించబడిన భూములను హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకుంది. ఆ భూమి మార్కెట్‌ విలువ సుమారు రూ.4,500 కోట్లుగా అధికారులు వెల్లడించారు.

Read Also: రూ.5 వేల కోసం యువకుడి ఆత్మహత్య

Follow Us On : Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>