ఈ తరం యువత ఎటుపోతుందో అర్థం కావడం లేదు. చిన్నచిన్న విషయాలకు కూడా చనిపోవడమే మార్గం అనుకుంటున్నారు. తాజాగా సిద్దిపేట(Siddipet)లో చోటు చేసుకున్న ఘటన ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. కేవలం రూ.5 వేలు ఇవ్వలేదన్న కోపంతో ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మీనాజీపేట గ్రామంతో నాగరాజు అనే యువకుడు.. తన తల్లిని రూ.5వేలు ఇవ్వాలని అడిగాడు. అందుకు తల్లి నిరాకరించడంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ కోపంలో నాగరాజు తన తల్లిపై దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తీవ్ర మనస్థాపానికి లోనైన నాగరాజు.. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అసలు అతడు రూ.5 వేలు ఎందుకు అడిగాడు? ఆత్మహత్యకు దారితీసిన పరిణామాలేంటి? అన్నది తెలియలేదు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read Also: డీప్ ఫేక్‌పై చట్టాలు రావాలి: చిరంజీవి

