సమన్వయంతో పనిచేసి మొంథా తుఫానును సమర్థంగా ఎదుర్కొన్నామని ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) పేర్కొన్నారు. ఆస్తి, ప్రాణ నష్టాన్ని భారీగా తగ్గించగలిగామని చెప్పుకొచ్చారు. టెక్నాలజీని కూడా వాడుకొని సమర్థంగా అరికట్టగలిగామని చెప్పారు. ఆస్తి నష్టాన్ని చాలా వరకు తగ్గించగలిగామన్నారు. శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో తుపాను నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన 175 మంది అధికారులు, సిబ్బందిని ‘సైక్లోన్ మొంథా ఫైటర్స్(Cyclone Montha Fighters)’గా గౌరవించారు. వారికి సర్టిఫికెట్లు, జ్ఞాపికలు, మెమెంటోలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. “తుపాను గురించి ముందుగానే సమాచారం ఇచ్చి ప్రజలకు అవగాహన కల్పించాం. బాపట్ల జిల్లా పరుచూరు వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని డ్రోన్ ద్వారా గుర్తించి కాపాడాం. ఒక ప్రార్థనా మందిరం చుట్టూ వరద నీరు చేరినప్పుడు 15 మందిని సురక్షితంగా రక్షించాం. వరద నీటిని తొలగించే పనులు వేగంగా జరిగాయి. సాంకేతికతతో పాటు అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సహకరించారు” అని తెలిపారు.
యుద్ధ ప్రాతిపదికన పనిచేశాం
తుఫాన్(Cyclone Montha) సమయంలో ఏపీ ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పనిచేసిందని చెప్పారు. రియల్ టైమ్ వెదర్ ట్రాకింగ్, డ్రోన్‌లు, ఉపయోగించి నిరంతరం వర్ష తీవ్రతను పర్యవేక్షించామన్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు ఎంఎంఎస్, మొబైల్ అప్‌ల ద్వారా హెచ్చరికలు పంపామని వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసు, ఫైర్ బలగాలు రంగంలోకి దిగి బాపట్లలో 20 మంది, ప్రార్థనా మందిరం వద్ద 15 మందిని రక్షించారని చెప్పారు. 14,415 రేషన్ షాపుల్లో ఒక లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం సిద్ధంగా ఉంచామన్నారు. ప్రతి కుటుంబానికి 25 కేజీలు (మత్స్యకారులకు 50 కేజీలు), పంచదార, చమత్స, ఉల్లి, బంగాళదుంపలు ఉచితంగా అందించామని తెలిపారు. విద్యుత్, రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థలను వేగంగా పునరుద్ధరించామని Chandrababu చెప్పారు.
Read Also: మెదడుకు మేలైన ఆహారం ఏంటో తెలుసా..!
Follow Us On : Instagram

