వివాహిత ఆత్మ‌హ‌త్య.. పోలీసుల అదుపులో భ‌ర్త‌

క‌లం, వెబ్ డెస్క్‌: తిరుప‌తి (Tirupati) జిల్లాలోని పుత్తూరులో పిల్ల‌ల‌తో స‌హా ఆత్మ‌హ‌త్య (Suicide) చేసుకొని మృతి చెందిన ప‌ద్మ కేసులో ఆమె భ‌ర్త శివ‌శంక‌ర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భ‌ర్త చేసిన అప్పులు, అత‌డి నిర్ల‌క్ష్యం, ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగానే ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్లు ప‌ద్మ రాసిన‌ లేఖ‌లో పేర్కొంది. శివ‌శంక‌ర్ ఇటీవ‌ల ఉద్యోగంలో చేరిన‌ట్లు చెప్తున్నాడు. భార్య ఎందుకు ఇంత దారుణానికి పాల్ప‌డిందో అర్థం కావ‌డం లేదంటున్నాడు. మ‌రోవైపు ప‌ద్మ త‌ల్లిదండ్రులు ప‌ద్మ భ‌ర్త‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు శివ‌శంక‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప‌ద్మ మృతిపై ఆమె అన్న కార్తీక్ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. త‌ల్లిదండ్రులు నెల‌నెలా ప‌ద్మ‌కు డ‌బ్బులు పంపించేవాళ్ల‌ని, శివ‌శంక‌ర్ ఎందుకు అప్పులు చేశాడో తెలియ‌ద‌ని చెప్పారు. త‌న చెల్లికి వ‌చ్చిన‌ ప‌రిస్థితి ఇంకెవ‌రికి రాకూడ‌ద‌న్నారు.

Read Also: లారీ కిందికి దూసుకెళ్లిన కారు.. ఇద్ద‌రు మృతి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>