Mobile Popup Ad
Mobile Popup Ad

అమీన్‌పూర్‌లో రెండోరోజు హైడ్రా కూల్చివేతలు

కలం, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో హైడ్రా (HYDRAA) కూల్చివేతలు రెండోరోజు కొనసాగుతున్నాయి. ఆదివారం సైతం భారీ పోలీస్ బంధోబస్తు మధ్య ఆక్రమణలు హైడ్రా కూల్చివేస్తోంది. కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీ అనుమతులతో ఐలాపూర్ భూముల్లో అక్రమంగా నిర్మించిన G+5 భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చివేశారు. రెవెన్యూ మునిసిపల్ అధికారులతో కలిసి ఈ భారీ ఆపరేషన్ ను నిర్వహిస్తున్నారు. శనివారం అమీన్‌పూర్‌లో రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలసి హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగించింది. ఐలాపురం (Ailapur) తండాతో పాటు గ్రామంలో ఇళ్ల జోలికి వెళ్లకుండా హైడ్రా చర్యలు తీసుకుంది.

కోర్టు స్టే ఆర్డర్ ఉన్న నిర్మాణాలు జరిపిన ముఖీమ్ గెస్ట్ హౌస్ తో పాటు, అతని సోదరుడు అజీమ్ నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని హైడ్రా (HYDRAA) తొలగించింది. తండాలోని నివాసాలతో పాటు ఐలాపురంలో ఇళ్ల జోలికి వెళ్లకుండా ఖాళీ స్థలాలను హైడ్రా స్వాధీనం చేసుకుంటుంది. ఐలాపురం గ్రామంలో మొత్తం 1,263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఇప్పటికే చాలా నివాసాలు వచ్చాయి. ఆ నివాసాల జోలికి వెళ్లకుండా మిగిలి ఉన్న 860 ఎకరాల ప్రభుత్వ భూమినే ప్రభుత్వం కాపాడుతోంది. 863 ఎకరాల భూమి విలువ రూ.15 వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Read Also: నో కాంప్రమైజ్.. ఇదే జెన్ జీ ఫార్ములా!!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>