పోలీసులకే షాక్​: చలాన్ల నుంచి తప్పించుకోవడానికి ఏం చేశాడంటే ?

కలం, వెబ్​ డెస్క్​ : హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ (Jubilee Hills) ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఒక విస్తుపోయే ఉదంతం వెలుగులోకి వచ్చింది. ట్రాఫిక్ చలాన్లకు చెక్ పెట్టేందుకు ఓ వ్యక్తి ఏకంగా జేమ్స్ బాండ్ తరహా టెక్నాలజీని తన కారుకు అమర్చాడు. ఈ సిస్టమ్ ద్వారా క్షణాల్లో ఒక నంబర్ ప్లేట్ స్థానంలో మరొకటి వచ్చేలా మాయ చేస్తూ అధికారులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు.

డ్రంక్ అండ్ డ్రైవ్ సోదాల్లో భాగంగా అతడిని ఆపి తనిఖీ చేయగా ఈ మోసం బయటపడింది. సాధారణ నంబర్ ప్లేట్ వెనుక దాగి ఉన్న ఈ సాంకేతిక మాయాజాలాన్ని చూసి పోలీసులు సైతం ఖంగుతిన్నారు. కేవలం ట్రాఫిక్ నిబంధనల నుండి తప్పించుకోవడమే కాకుండా చట్టాన్ని తప్పుదోవ పట్టించేలా ఈ డూప్లికేట్ ప్లేట్లతో (Fake Number Plate) కిలాడీ వ్యవహారం నడిపించాడు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి కారును సీజ్ చేశారు.

Read Also: అర్బన్ నక్సల్స్‌పై డీజీపీ సంచలన వ్యాఖ్యలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>