కలం, వెబ్ డెస్క్ : హైడ్రా మరో ఖరీదైన భూమిని అక్రమార్కుల చెర నుంచి కాపాడింది. శేరిలింగంపల్లిలో రూ.13 కోట్ల విలువైన పార్కు స్థలాన్ని కొందరు కబ్జా చేశారు. మదీనాగూడలో సర్వే నెంబర్ 23లో ఉన్న వెయ్యి గజాల స్థలాన్ని కొందరు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేశారు. పార్క్ మధ్యలో నుంచి ఓ గోడను కట్టేసి స్థలాన్ని ఆక్రమించుకున్నారు. ఈ విషయంపై స్థానికులు హైడ్రా (HYDRAA)కు ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగిన హైడ్రా (HYDRAA) అధికారులు కూల్చివేతలు చేపట్టారు. పార్కు హద్దులు గుర్తించి అక్కడి వరకు కూల్చివేశారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.


