Mobile Popup Ad
Mobile Popup Ad

హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఇలా వెళ్లాలి!

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో (Hyderabad) పలు చోట్ల నిర్మాణ పనులు కారణంగా ఆయా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు సంబంధించి ఆంక్షలు (Traffic Diversions) విధిస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ పేర్కొన్నారు. మెహదీపట్నం రైతుబజార్ వద్ద స్కైవాక్ నిర్మాణ పనులతో పాటు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌ వే పై సీసీటీవీ కెమెరా పోల్స్ పనులు జరుగుతున్నాయి. మే 24, 25వ తేదీల్లో సాయంత్రం 4 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు, ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ట్రాఫిక్ మళ్లింపులు, ప్రత్యామ్నాయ మార్గాలివే..

•  మాసబ్ ట్యాంక్ నుంచి రేతిబౌలి వైపు: మాసబ్ ట్యాంక్, ఎన్ఎండీసీ (NMDC), సరోజినీ దేవి కంటి ఆసుపత్రి వైపు నుంచి రేతిబౌలి – నానల్ నగర్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నెం.2, 3 (అజీజియా మసీదు) వద్ద మెరాజ్ కేఫ్ మీదుగా కుడి వైపునకు మళ్లించి, మెహదీపట్నం పిల్లర్ నెం. 15 వద్ద సాధారణ మార్గంలోకి అనుమతిస్తారు.

•  టోలిచౌకి, లంగర్‌హౌస్ నుంచి మాసబ్ ట్యాంక్ వైపు: టోలిచౌకి, లంగర్‌హౌస్, అత్తాపూర్ నుంచి నానల్ నగర్ – రేతిబౌలి మీదుగా మాసబ్ ట్యాంక్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నెం. 23 వద్ద యూ-టర్న్ చేయించి, వ్యతిరేక దిశలో వెళ్లి, అనంతరం పిల్లర్ నెం. 4 & 5 వద్ద మళ్లీ సాధారణ మార్గంలోకి వెళ్లొచ్చు.

•  మాసబ్ ట్యాంక్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వైపు: మాసబ్ ట్యాంక్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వైపు వెళ్లే వాహనాలను సరోజినీ దేవి కంటి ఆసుపత్రి వద్ద లక్ష్మీనగర్ రాంప్ (పిల్లర్ నెం. 77) వైపునకు మళ్లిస్తారు.

శంషాబాద్ విమానాశ్రయం (RGIA) నుంచి మెహదీపట్నం వైపు: శంషాబాద్ విమానాశ్రయం నుంచి మెహదీపట్నం వైపు వచ్చే వాహనాలు లక్ష్మీనగర్ రాంప్ (పిల్లర్ నెం. 88) వద్ద ఎగ్జిట్ (Exit) తీసుకోవాల్సి ఉంటుంది. పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై పనుల పురోగతిని బట్టి వాహనాలను ఆయా డౌన్ రాంపుల ద్వారా కిందకు అనుమతిస్తారు.

Read Also: తెలంగాణలో హీట్ వేవ్ ఎఫెక్ట్.. రెడ్ అలర్ట్ జారీ!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>