కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో రోజురోజుకూ ఎండల తీవ్రత (Telangana Heatwave) పెరుగుతోంది. భానుడి భగభగలతో పాటు వేడిగాలుల ఉధృతి కూడా ఎక్కువగానే ఉంది. సెగ గాలులతో అనేక మంది వడదెబ్బకు గురవుతున్నారు. ఆసుపత్రిల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.
రాష్ట్రంలో వచ్చే 3 రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. ముఖ్యంగా కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఎండల తీవ్రత పెరగనున్న దృష్ట్యా మధ్యాహ్నం ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించింది.

