మెదక్‌లో రోడ్డెక్కిన రైతులు.. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్!

కలం, మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లా కొల్చారం మండలం సంగాయిపేటలో రైతుల ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ మెదక్-జోగిపేట రోడ్డుపై రైతుల రాస్తారోకో చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం చేస్తుందని మండిపడ్డారు.

గత కొన్ని నెలలు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులకు సర్దిచెప్పడంతో వారు ధర్నాను విరమించారు.

Read Also: ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు హరీశ్ రావు మద్దతు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>