స్పెయిన్‌లో కార్చిచ్చు: 12 మంది దుర్మరణం!

కలం, వెబ్ డెస్క్ : దక్షిణ స్పెయిన్‌లోని అండలూసియా రీజియన్‌లో సంభవించిన భారీ కార్చిచ్చు (Spain wildfire) తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ మధ్య కాలంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. ఈ ఘటనలో మంటల్లో చిక్కుకుని మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 12కి చేరింది. ప్రమాద తీవ్రత దృష్ట్యా అధికారులు తక్షణమే స్పందించి ప్రభావిత ప్రాంతాల్లోని రోడ్లను మూసివేశారు. స్థానిక నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక బృందాలు విస్తృతంగా శ్రమిస్తున్నాయి.

మంటలను అదుపు చేసేందుకు 150 మందికి పైగా ఫైర్‌ఫైటర్లు, మిలిటరీ ఎమర్జెన్సీ టీమ్స్, ప్రత్యేక ఎయిర్‌క్రాఫ్ట్‌లు రంగంలోకి దిగాయి. వీరు తమ ప్రాణాలను పణంగా పెట్టి మంటలను అదుపు చేయడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంపై స్పెయిన్ ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడటం, మంటలను వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకురావడమే ప్రస్తుతం మన మొదటి ప్రాధాన్యత అని ఆయన అధికారులను ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>