కలం, నిజామాబాద్ బ్యూరో: ప్రాధాన్యతతో కూడిన జన గణన ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) ఆదేశించారు. జన గణనలో భాగంగా కొనసాగుతున్న హౌస్ లిస్టింగ్ ప్రక్రియను కలెక్టర్ నిజామాబాద్ (Nizamabad) నగరంలోని పలు ప్రాంతాల్లో సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గౌతంనగర్, ఆర్య నగర్ టెలికాం కాలనీలలో హౌస్ లిస్టింగ్ నిర్వహిస్తున్న తీరును కలెక్టర్ పరిశీలన జరిపారు. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు గుర్తింపు కార్డులు ధరించారా? లేదా? అన్నది గమనించారు. వారు జన గణన (Census) విధులు నిర్వర్తిస్తున్న తీరును పరిశీలించి, ఇప్పటివరకు హౌజ్ లిస్టింగ్ ఎంత శాతం పూర్తయ్యింది? తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్వీయ గణన చేసుకున్న వారికి సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, పక్కాగా నిర్ధారణ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
జన గణన (Nizamabad Census) కోసం వెళ్లే సమయంలో క్యూఆర్ కోడ్ తో జారీ చేయబడిన ఐడీ కార్డును తప్పనిసరిగా ధరించాలని సూచించారు. తప్పిదాలకు అవకాశం లేకుండా జాగ్రత్తగా జన గణన జరపాలని అన్నారు. జన గణనకు సంబంధించి ప్రగతిని తెలియజేస్తూ రోజువారీ నివేదికలు పంపాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్, సూపర్వైజర్లు హన్మాండ్లు, సాయిరాం, ఎన్యూమరేటర్లు భాగ్యలక్ష్మి, రాము తదితరులు ఉన్నారు.
Read Also: ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు హరీశ్ రావు మద్దతు
Follow Us On : WhatsApp

