Mobile Popup Ad
Mobile Popup Ad

హ‌నుమాన్ విజ‌య యాత్ర‌… హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు!

క‌లం, వెబ్ డెస్క్‌: హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ విజయ యాత్ర (Hanuman Vijaya Yatra)ను పురస్కరించుకొని హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఏప్రిల్ 2న‌ ట్రాఫిక్ (Traffic) ఆంక్షలు అమలులో ఉంటాయని నగర ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ఈ శోభాయాత్ర గౌలిగూడ రామ్ మందిర్ నుంచి ప్రారంభమై ప్యారడైజ్ ఎక్స్ రోడ్‌ వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఉదయం 9:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు యాత్ర సాగే మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని, వాహనదారులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

ముఖ్యంగా సిటీలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన కూడళ్లలో ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు కోరారు. ట్రాఫిక్‌కు సంబంధించిన ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అధికారిక ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను అనుసరించాలని వారు తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

డైవ‌ర్ష‌న్ పాయింట్లు ఇవే…

గౌలీగూడ‌, పుట్లిబౌలి ఎక్స్ రోడ్‌, అబిడ్స్‌, కాచిగూడ‌, నారాయ‌ణ‌గూడ‌, ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌, అశోక్ న‌గ‌ర్‌, గాంధీ న‌గ‌ర్‌, క‌వాడిగూడ‌, ఆర్పీ రోడ్‌, మ‌హంకాళీ టెంపుల్‌, పార‌డైజ్ జంక్ష‌న్‌.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>