Mobile Popup Ad
Mobile Popup Ad

జ్యోతిష శాస్త్రంలో సరికొత్త విప్లవం.. ఈ యాప్‌‌తో దోష నివారణకు చెక్

కలం, వెబ్ డెస్క్: ఏఐ యుగంలోనూ సమస్త మానవాళికి ఉపయోగపడేలా ఓ అద్బుతమైన యాప్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటిదాకా వచ్చిన అనేక అప్లికేషన్లు కేవలం టెక్నాలజీ మీద మాత్రమే ఆధారపడ్డాయి. కానీ తొలిసారిగా ఏఐతోపాటు, పురాతన శాస్త్రాల ఆధారంగా పనిచేసే సరికొత్త యాప్ విడుదలైంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక్క అప్లికేషన్‌తో మనిషిని వేధిస్తున్న అనేక సమస్యలను గుర్తిస్తుంది. అలాగే తక్షణ పరిష్కారాలు అందించడం ఆ యాప్ ప్రత్యేకత. ఈ యాప్‌ను (Dosha Nivaran App) రూపొందించింది ఎవరో కాదు.. మన హైదరాబాదీలే.

ప్రాచీన వేద జ్యోతిష్య సూత్రాలతో..

హైదరాబాద్‌కు (Hyderabad) చెందిన ఆజా ఆస్ట్రోటెక్ కంపెనీ 5000 ఏళ్ల పురాతన బృహత్ పరాశర హోర శాస్త్రం ఆధారంగా ‘దోష నివారణ’ యాప్‌ను (Dosha Nivaran App)  ప్రారంభించింది. సమస్యలు, దోషాలను గుర్తించి, బృహత్ పరాశర హోర శాస్త్రం ప్రకారం పరిష్కార మార్గాలను అందిస్తుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఫీనిక్స్ గ్రూప్ డైరెక్టర్ బడిగా శ్రీకాంత్, రిటైర్డ్ జిల్లా జడ్జి హేమంత్ కుమార్ దింత్యాల, అలాగే టీ-హబ్ మాజీ సీఈఓ శ్రీనివాస్ రావు మహంకాళి కలిసి ఈ యాప్‌ను ఆవిష్కరించారు. ఇది పూర్తిగా బృహత్ పరాశర హోర శాస్త్రం ప్రాథమిక సూత్రాలపై రూపొందించిన ప్రత్యేక డిజిటల్ ప్లాట్‌ఫామ్ అని తెలిపారు కంపెనీ సీఈఓ ఫణిరాజ్ జలిగామా. ‘ప్రస్తుత అప్లికేషన్లు ఎక్కువగా ఏఐ పద్దతుల ఆధారంగా రూపొందుతున్నాయి. కానీ మా సాఫ్ట్‌వేర్ వ్యవస్థ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఏఐకి బదులుగా పరాశర మహర్షి రచించిన ప్రాచీన వేద జ్యోతిష్య సూత్రాలను విశ్లేషించి సరికొత్త సాఫ్ట్‌వేర్ ఇంజిన్‌గా రూపొందించాం’ అని చెప్పారు.

పెళ్లిళ్ల నుంచి గృహప్రవేశాల దాకా..

ఈ అప్లికేషన్ వినియోగదారుడి జనన సమయానికి సంబంధించిన గ్రహస్థితులను విశ్లేషించి ‘కాస్మిక్ బ్లూప్రింట్‌’ను రూపొందిస్తుంది. యోగాలు, దోషాలు, సరైన పరిహారాలు, వ్యక్తిగత రిపోర్టులు, ముహూర్త సేవలను అందించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ వ్యవస్థ వివాహాలు, గృహప్రవేశాలు, కొత్త ఉద్యోగంలో చేరడం వంటి ముఖ్య సందర్భాలతో‌పాటు సి-సెక్షన్ ప్రసవాలు, ప్రణాళికాబద్ధ శస్త్రచికిత్సల కోసం కూడా శుభ ముహూర్తాలను సూచించగలదు. భారతీయ ప్రవాసులకు సులభంగా అందుబాటులో ఉండేలా ఈ యాప్‌ను ప్రస్తుతం తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ప్రారంభించినట్లు ఫణిరాజ్ తెలిపారు. జూన్ నెలలో మరో 11 భారతీయ భాషల్లో కూడా ఈ యాప్‌ను (Dosha Nivaran App) అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ అప్లికేషన్ స్మార్ట్ ఫోన్ లో ఉంటే ప్రతి ఇంట్లో ఓ జ్యోతిష్యుడు ఉన్నట్టే అని యాప్ రూపకర్తలు తెలిపారు.

Read Also: క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు.. విచ్ఛిన్నమవుతున్న కుటుంబాలు!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>