Mobile Popup Ad
Mobile Popup Ad

మెట్రో పిల్ల‌ర్‌కు క్రాక్‌.. హైద‌రాబాద్ మెట్రో క్లారిటీ!

క‌లం, వెబ్ డెస్క్: హైద‌రాబాద్‌లోని అమీర్‌పేట్‌ (Ameerpet)లో జ‌రిగిన భారీ అగ్ని ప్ర‌మాదం మెట్రో రైల్ ప్ర‌యాణికుల‌ను సైతం తీవ్ర ఆందోళ‌న‌కు గురి చేసింది. ఈ ప్ర‌మాదం జ‌రిగిన మూడంత‌స్తుల‌ భ‌వ‌నానికి స‌మీపంలోనే అమీర్‌పేట్ మెట్రో స్టేష‌న్ ఉంది. మంట‌లు భారీ ఎత్తున ఎగిసిప‌డ్డ స‌మ‌యంలో ఏ1043 నంబర్ మెట్రో పిల్లర్‌కు అగ్ని సెగలు అంటుకున్నాయి. దీంతో ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఆ త‌ర్వాత ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చిన కొద్ది సేప‌టికి జేఎన్‌టీయూ నిపుణుల బృందం రంగంలోకి దిగి ప్రత్యేక డివైజ్‌లతో పిల్లర్ నాణ్యత, సామర్థ్య పరీక్షలను నిర్వహించింది. దీంతో మెట్రో పిల్ల‌ర్‌కు ప‌గుళ్లు వ‌చ్చాయంటూ వార్త‌లు ప్ర‌చారం అయ్యాయి.

మెట్రో పిల్ల‌ర్‌కు ప‌గుళ్లు వ‌చ్చాయంటూ జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని హైద‌రాబాద్ మెట్రో (Hyderabad Metro) ఖండించింది. కేవ‌లం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. మంట‌లు మెట్రో స‌మీపానికి రావ‌డంతో నిపుణులు ప‌రీక్ష‌లు నిర్వ‌హించార‌న్నారు. మెట్రో పిల్ల‌ర్‌కు ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని వెల్ల‌డించారు. ప్ర‌క‌ట‌న బోర్డు కాలి దాని లిక్విడ్ పిల్ల‌ర్‌పై ప‌డింద‌ని చెప్పారు. ఈ ప‌రీక్ష‌ల‌ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామ‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>