​చంద్రుగొండ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీలు

​కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గురువారం చంద్రుగొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్‌కు వచ్చిన బాధితుల ఫిర్యాదులను స్వయంగా పరిశీలించారు. వారి సమస్యలపై తక్షణమే స్పందించి త్వరగా న్యాయం చేకూర్చేలా పని చేయాలని ఆదేశించారు. ​అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బంది విధుల నిర్వహణ తీరు, స్టేషన్ రికార్డులు, క్రైమ్ రికార్డులను తనిఖీ చేసి అధికారులకు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. ​మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి పోలీస్ అధికారి, స్టేషన్ సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని ఎస్పీ సూచించారు. డిజిటల్ విధానాలను అలవర్చుకుని ప్రజలకు మరింత మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించాలని స్పష్టం చేశారు.

అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా..

చంద్రుగొండ ​మండలంలో అక్రమ ఇసుక రవాణా, తవ్వకాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ రోహిత్ రాజు ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ఇసుక తరలించే వారిపై ఉక్కుపాదం మోపాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ రవాణాను సహించేది లేదని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్‌ సిబ్బంది వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చంద్రుగొండ సీఐ శ్రీలక్ష్మి, ఎస్సై శివరామకృష్ణ, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>