కలం, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకోబోతున్నారు. బెంగళూరులోని ఫ్యాషన్, బ్యూటీ సెలూన్స్ రంగంలో పేరు ప్రఖ్యాతులున్న గౌరి స్ప్రాట్ (Gauri Spratt)ను ఆయన పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. జూలై 5న ముంబైలో వీరి వివాహం జరుగనుంది. కొన్నేళ్లుగా అమీర్ ఖాన్, గౌరి చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్నారు. మీడియాలో వీరిద్దరిపై రకరకాలుగా పుకార్లు వచ్చాయి. చివరికి అమీర్ ఖాన్ స్వయంగా వీరిద్దరి బంధాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు.
అమీర్ ఖాన్ 1986లో రీనా దత్తాను రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. 2002 వరకు వీరి వివాహ బంధం సాఫీగానే సాగింది. వ్యక్తిగత కారణాలతో వీరిద్దరూ ఇద్దరు పిల్లలు పుట్టాక 2002లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మూడేళ్లకు 2005లో కిరణ్ రావుతో అమీర్ రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇక 2021లో వీరు కూడా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత అమీర్ ఖాన్ గౌరి స్ప్రాట్‌తో ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ ఒకరికొకరు 25 ఏళ్లుగా తెలుసని అమీర్ ఖాన్ వెల్లడించారు. ఇద్దరూ రిలేషన్‌సిప్‌ను సీరియస్‌గా తీసుకొని పెళ్లి బంధంలోకి అడుగు పెట్టబోతున్నట్లు ప్రకటించారు. ఇక గౌరి స్ట్రాట్‌కు కూడా గతంలో వివాహం జరుగగా విడాకులు తీసుకున్నారు. ఆమెకు మొదటి భర్తతో ఓ కుమారుడు ఉన్నారు. మొత్తానికి 61 ఏళ్ల వయస్సులో అమీర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకోవడం బాలీవుడ్‌తో పాటు అన్ని భాషల సినీ రంగాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

