భర్త మరణం.. మానవత్వం చూపని అత్తింటివారు

కలం, వెబ్​ డెస్క్​ : మానవత్వం అంతమవుతుందనడానికి హైదరాబాద్​ మాదాపూర్​ (Madhapur) లో జరిగిన ఘటనే సాక్ష్యంగా నిలుస్తోంది. భర్త మరణంతో నిండు దు:ఖంలో మునిగిపోయిన మహిళను అత్తింటివారు అక్కున చేర్చుకుపోగా అవమానించారు. మహిళతో పాటు పిల్లలను తమ ఇంట్లోకి ప్రవేశించడానికి అనుమతి లేదని చెప్పారు. బాధితురాలు దీన కుమారి తెలిపిన వివరాల ప్రకారం.. భర్త మరణం తరువాత తనతోపాటు తన పిల్లలను అత్తింటి వారు ఇంట్లోకి రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకు పోయాక తనతో సంబంధం లేదంటున్నారని.. పిల్లలు తమ వారసులే అనడానికి డీఎన్​ఏ రిపోర్ట్​ చూపించాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. అయితే, తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆ మహిళ 20 రోజులుగా అత్తింటి ఎదుట వంటచేసుకుంటూ పిల్లలతో బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. దీనికి సంబంధించిన వీడియో చూసిన జనాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read Also: పాకిస్థాన్‌లో 80 శాతం మంది స్వలింగ సంపర్కులే!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>