కలం, వెబ్ డెస్క్: పాకిస్థాన్ ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్ట్ హీనా బలూచ్ (Hina Baloch) ఆ దేశ సామాజిక స్థితిగతులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పాక్‌లో సుమారు 80 శాతం మంది ‘గే’లు ఉన్నారని, మిగిలిన 20 శాతం మంది బైసెక్సువల్స్ అని పేర్కొన్నారు. ఇది ఆ దేశంలో అందరికీ తెలిసిన ‘ఓపెన్ సీక్రెట్’ అని, కానీ మతం, సంస్కృతి అనే ముసుగులో ఎవరూ ఈ నిజాన్ని బయటికి ఒప్పుకోరని విమర్శించారు. అక్కడ స్వలింగ సంపర్కం అనేది సాధారణ విషయమని స్పష్టం చేశారు. సమాజంలో లోతుగా పాతుకుపోయిన ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారని హీనా బలూచ్ అన్నారు.
ఎవరీ హీనా బలూచ్?
హీనా బలూచ్ (Hina Baloch).. ట్రాన్స్‌జెండర్ హక్కుల కార్యకర్త. పాక్ (Pakistan) ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ ఎదుర్కొంటున్న సవాళ్లు, సామాజిక వివక్షపై గళమెత్తుతూ గుర్తింపు పొందారు. ఆమె కేవలం సామాజిక కార్యకర్తగానే కాకుండా, పాక్‌లో పాతుకుపోయిన ద్వంద్వ ప్రమాణాలను బయటపెడుతుంటారు. లైంగిక మైనారిటీల పట్ల ఉన్న అపోహలను నిర్మొహమాటంగా ఎండగడుతుంటారు. ముఖ్యంగా అణచివేతకు గురవుతున్న వారి హక్కుల కోసం పోరాతుంటారు. అంతర్జాతీయ వేదికలపై సైతం పాకిస్థానీ ట్రాన్స్‌జెండర్ల గొంతుకగా నిలుస్తున్నారు.
Read Also: కొడుకుకు ‘భరత్’ అని పేరు పెట్టిన పాకిస్థాన్ మహిళ!
Follow Us On: Facebook

