కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ (Bandla Ganesh) ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు (Wedding) మోగనున్నాయి. ఆయన కుమార్తె జానకి వివాహం సూర్యతేజ చిలుకూరితో ఖరారైంది. ఈ శుభకార్యానికి సంబంధించి ఇప్పటికే ఇంట్లో ‘పసుపు కుంకుమ’ వేడుకను నిర్వహించగా దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ‘దేవుడి ఆశీస్సులు, పెద్దల దీవెనలతో మా ఇంట్లో త్వరలో శుభకార్యం జరగబోతోంది’ అంటూ ఆయన పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోల్లో కాబోయే వధూవరులు సంప్రదాయ దుస్తుల్లో కళకళలాడుతూ కనిపిస్తున్నారు. అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వరుడు సూర్యతేజ ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది.

