నగరంలో గ్యాస్ కష్టాలు: ఆటో డ్రైవర్ల ఆందోళన

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ (Hyderabad) నగరంలోని సాగర్ రింగు రోడ్డు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎల్పీజీ గ్యాస్ కొరతను నిరసిస్తూ ఆటో డ్రైవర్లు ఆందోళనకు (Auto Drivers Protest) దిగారు. గత కొన్ని రోజులుగా గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద గంటల తరబడి వేచి ఉన్నప్పటికీ, సరైన సమయానికి గ్యాస్ లభించడం లేదని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ దొరక్కపోవడంతో తమ ఉపాధి దెబ్బతింటోందని, పూట గడవడమే కష్టంగా మారిందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నిరసనలో భాగంగా ఆటో డ్రైవర్లు తమ వాహనాలను హైవేపై అడ్డంగా నిలిపివేసి రాస్తారోకో (Auto Drivers Protest) చేపట్టారు. దీనివల్ల సాగర్ హైవే వైపు వెళ్లే వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయి, రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకుని గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించాలని, తమ సమస్యను పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేదే లేదని వారు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Read Also: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>