కలం, వెబ్ డెస్క్: కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు (Gold and Silver Rates) బుధవారం నాటికి భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో రూ. 1,49,510గా ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,970 పెరిగి రూ. 1,51,480 కి ఎగబాకింది. రూ.1,37,050గా ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,800 పెరిగి రూ.1,38,850గా ఉంది. రూ.1,12,130గా ఉన్న 18 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,13,610 అయ్యింది. పలు నగరాల్లో 1గ్రాము గోల్డ్ ధరలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం రూ.15,148గా ఉంది. చెన్నైలో రూ.15,327, ఢిల్లీలో రూ.15,163, ముంబైలో రూ.15,148, బెంగుళూరులో రూ.15,148, కలకత్తాలో రూ.15,148 ఉంది.
ఇక వెండి విషయానికొస్తే..రూ.2,50,000 ఉన్న కిలో వెండి ఏకంగా రూ.5,000 పెరిగి రూ.2,55,000గా ఉంది. కేజీ వెండి చెన్నైలో రూ.2,65,000 ఉండగా.. ముంబైలో రూ.2,55,000, ఢిల్లీలో రూ.2,55,000 ఉంది. కలకత్తాలో రూ.2,55,000, బెంగుళూరులో రూ.2,55,000, హైదరాబాద్ లో రూ.2,65,000, కేరళలో రూ.2,65,000, పూణేలో రూ.2,55,000, వడోదర రూ.2,55,000, అహమ్మదాబాద్ లో రూ.2,55,000 ఉంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు బంగారం, వెండి ధరలను (Gold and Silver Rates) ప్రభావితం చేస్తున్నాయి. తాజగా బంగారం, వెండి ధరలు ఆల్‌టైమ్ గరిష్ఠాల నుంచి దిగి వచ్చాయి.
Read Also: పెరిగిన ఈవీ క్రేజ్.. కానీ అసలు సవాల్ ఇదే!
Follow Us On: Instagram

