పూజారి అసభ్య ప్రవర్తన.. దేహశుద్ధి చేసిన మహిళలు

కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసి (Varanasi)లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పవిత్ర గంగా నదిలో పడవ ప్రయాణం చేస్తున్న సమయంలో ఇద్దరు మహిళల పట్ల ఒక పూజారి అసభ్యంగా ప్రవర్తించడం స్థానికంగా సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నదిలో పడవ కదులుతుండగా, ఆ పూజారి (Priest) మహిళల దుస్తులు లాగుతూ వికృత చేష్టలకు పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అతని అకృత్యాన్ని భరించలేకపోయిన సదరు మహిళలు అక్కడికక్కడే ఎదురుతిరిగారు. పూజారిని పట్టుకుని అందరూ చూస్తుండగానే చితక్కొట్టారు. మహిళలు దేహశుద్ధి చేస్తుండటంతో, వారి దెబ్బలకు తాళలేక ఆ పూజారి పడవ పైనుంచి గంగానదిలోకి దూకి తప్పించుకున్నాడు.

పవిత్రమైన ప్రదేశం వారణాసి (Varanasi)లో ఇటువంటి అరాచకానికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ వైరల్ వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టి, నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు.

Read Also: లైంగిక వేధింపుల కేసు: ప్రముఖ మలయాళ దర్శకుడు అరెస్ట్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>