హైదరాబాద్‌లో లవ్ జిహాద్.. నవాజ్ మోసాలు బయటపెట్టిన బాధితురాలు

కలం, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా లవ్ జిహాద్ (Love Jihad) ఘటనలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు అనేక కేసులు బయటపెడుతున్నాయి. లవ్ జిహాద్ పేరుతో ఇటీవల కూకట్ పల్లి యువతి దారుణంగా మోసపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఆమె హైదరాబాద్ (Hyderabad) ప్రెస్ క్లబ్ వేదికగా సంచలన విషయాలు బయటపెట్టారు. నవాజ్ అనే యువకుడు ప్రేమ పేరుతో తనను మోసం చేసి, మత మార్పిడి కోసం తీవ్రంగా వేధించాడని బాధితురాలు సాక్ష్యాధారాలతో బయటకొచ్చింది. తనను బలవంతంగా బీఫ్ తినాలని, ఖురాన్ చదవాలని ఒత్తిడి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. కేవలం వాట్సాప్, టెలిగ్రామ్ కాల్స్ ద్వారానే సంప్రదింపులు జరుపుతూ, నమ్మకం కలిగించడానికి తాయత్తులు కూడా కట్టించాడని ఆమె ఆరోపించింది.

నవాజ్ తన మిత్రులతో కలిసి తనపై అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా, తన సోదరిని కిడ్నాప్ చేసి రేప్ చేస్తామని, తన వ్యక్తిగత వీడియోలను బయటపెడతామని బెదిరించినట్లు బాధితురాలు వెల్లడించింది. నాసిక్ టీసీఎస్ తరహాలోనే ఇక్కడ కూడా పక్కా ప్లాన్‌తో తనను ట్రాప్ (Love Jihad) చేశారని ఆరోపించింది. తనలా మోసపోవద్దనే ఉద్దేశంతోనే ధైర్యంగా ముందుకు వచ్చానని ఆమె పేర్కొంది. నవాజ్ తన దగ్గర నుంచి రూ. 35 లక్షలకు పైగా తీసుకున్నాడని, తాను నవాజ్‌కు 7, 8వ భార్యనని ఆరోపించింది.

Read Also: నిఖిల్ ‘స్వయంభు’ నుంచి ఫస్ట్ సాంగ్.. థియేట్రికల్ విజువల్స్‌తో సర్‌ప్రైజ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>