కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ బోడుప్పల్ (Boduppal) లో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. అసూయతో ఓ మహిళ నాలుగేళ్ల బాలుడికి యాసిడ్ తాగించి హత్యాయత్నానికి పాల్పడింది. ఇంట్లో తన కొడుకును తక్కువ చూస్తున్నారనే కారణంతో ఈ దారుణానికి ఒడిగట్టింది. బోడుప్పల్ (Boduppal) పరిధిలో ఉంటున్న నాగరాజు, సంధ్య దంపతులకు కార్తీక్ అనే నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. ఈ క్రమంలో నాగరాజు సోదరుడి భర్త మంజూల కార్తీక్ పై అసూయ ఏర్పడింది. తన మామ కార్తీక్ పై ఎక్కువ ప్రేమ చూపిస్తూ మంజూలా కొడుకును పట్టించుకోవడం లేదని కక్ష పెంచుకుంది.
దీంతో ఆ బాలుడిని ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకుంది. గతంలోనూ మంజూల పలుసార్లు కార్తిక్ పై హత్యాయత్నానికి ప్రయత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ నెల 9వ తేదీన మంజూల కార్తీక్ ను కిచెన్ లోకి తీసుకెళ్లింది. జ్యూస్ తాగితే చాక్లెట్ కొనిస్తానని చెప్పి బలవంతంగా యాసిడ్ తాగించింది. గమనించిన బాలుడి తల్లిదండ్రులు హుటాహుటినా ఓ ప్రయివేటు ఆస్ప్రతికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, తల్లి తరువాత తల్లిలా చూసుకోవాల్సిన చిన్నమ్మ బాలుడిని చంపాలని చూడడం స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.
Read Also: కోతిని తరుమబోయి సజీవ దహనం.. షాకింగ్ వీడియో
Follow Us On: X(Twitter)

