కలం, సినిమా : టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth). ఇప్పుడు ఈ యంగ్ హీరో మరో భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నిఖిల్ “స్వయంభు” (Swayambhu) అనే భారీ సినిమా చేస్తున్నాడు. ఈ బిగ్గెస్ట్ పీరియాడిక్ మూవీలో నిఖిల్ ఒక యోధుడిలా కనిపించనున్నాడు. నిఖిల్ సరసన సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కే.కే. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. రవి బ్రసూర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు సాయంత్రం 6:03 గంటలకు “స్వయంభు” (Swayambhu) నుండి ‘రారా ధీవరా’ (Ra Ra Dheevara) అనే ఫస్ట్ సాంగ్ విడుదల కానుందని నిఖిల్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ పాట కేవలం సంగీతానికే పరిమితం కాకుండా, సినిమా నేపథ్యాన్ని, ముఖ్యంగా యోధుల ప్రపంచాన్ని పరిచయం చేసే కీలక భాగంగా ఉండబోతోందని తెలిపాడు. ‘గెట్ రెడీ టు బి బ్లోన్ అవే’ అంటూ నిఖిల్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

